e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News ల‌క్ష్మ‌ణ్‌కు బీసీసీఐ ఆఫ‌ర్‌.. నో చెప్పిన‌ స్టైలిష్ బ్యాట్స్‌మ‌న్‌

ల‌క్ష్మ‌ణ్‌కు బీసీసీఐ ఆఫ‌ర్‌.. నో చెప్పిన‌ స్టైలిష్ బ్యాట్స్‌మ‌న్‌

ముంబై: స్టైలిష్ బ్యాట్స్‌మ‌న్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌కు బీసీసీఐ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. అయితే అత‌ను మాత్రం నో చెప్పాడు. ప్ర‌స్తుతం నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ హెడ్‌గా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ టీమిండియా కోచ్‌గా వెళ్ల‌డం ఖాయం కావ‌డంతో.. అత‌ని స్థానంలో ల‌క్ష్మ‌ణ్‌ను తీసుకురావాల‌ని బీసీసీఐ భావించింది. ఇదే విష‌యాన్ని ల‌క్ష్మ‌ణ్‌కు చెప్ప‌గా అత‌డు వ‌ద్ద‌న్నాడు. దీంతో ఎన్సీఏ హెడ్ కోసం బీసీసీఐ త‌న వేట‌ను కొన‌సాగించ‌నుంది.

ఇండియ‌న్ క్రికెట్‌కు ఎన‌లేని సేవ‌లు అందించిన ఓ మంచి మాజీ క్రికెట‌ర్ కోసం బీసీసీఐ చాన్నాళ్లుగా వెతుకుతోంది. ఆ క్ర‌మంలో ల‌క్ష్మ‌ణ్ క‌నిపించాడు. బెంగాల్ టీమ్‌కు బ్యాటింగ్ క‌న్స‌ల్టెంట్‌గా, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మెంటార్‌గా ఉన్న ల‌క్ష్మ‌ణ్‌.. ఎన్సీఏ హెడ్ పోస్ట్‌కు సూట‌వుతాడ‌ని బోర్డు భావించింది. టీమిండియా త‌ర‌ఫున 134 టెస్టులు ఆడిన ల‌క్ష్మ‌న్‌.. 8781 ప‌రుగులు చేశాడు. అందులో 17 సెంచ‌రీలు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement