హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేంద్ర పాలిత ప్రాంతం డామన్-డయ్యూ వేదికగా జరుగుతున్న తొలి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్‌లో తెలంగాణ పతక బోణీ కొట్టింది. గురువారం జరిగిన పురుషుల 5కి.మీల ఓపెన్ క్యాటగిరీ స్విమ్మింగ్‌లో రాష్ర్టానికి చెందిన గుండు విష్ణువర్ధన్ 1:06:58సెకన్ల టైమింగ్‌తో రజత పతకంతో మెరిశాడు.
ద్రుపద్ రామకృష్ణ(1:06:46సె, కర్నాటక), హేమంత్(1:07:41సె, తమిళనాడు) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు పురుషుల సెపక్తక్రా డబుల్ ఈవెంట్లో ఆకుల హరినాథ్, సుమంత్, శశాంక్‌తో కూడిన తెలంగాణ టీమ్ కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది.