Virender Sehwag : నజఫర్గఢ్ నవాబ్.. ఈ పేరు వింటే చాలు తొలి బంతి నుంచి బౌండరీలు బాదే వీరుడు గుర్తుకొస్తాడు. క్రీజులో ఠీవీగా నిల్చొని అలవోకగా భారీ సిక్సర్లు బాదే యోధుడు.. భయమెరుగని విధ్వంసక ఆటగాడు మదిలో మెదులుతాడు. అతడే.. వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag). టీమిండియా డాషింగ్ ఓపెనర్‌గా కోట్లాదిమంది మనసులు గెలిచిన వీరూ ఆదివారం 46వ వసంతంలో అడుగుపెట్టాడు.
తన సుడిగాలి బ్యాటింగ్‌తో ప్రపంచస్థాయి బౌలర్లకు నిద్రలేని రాత్రలు మిగిల్చిన వీరూ ఆదివారం పుట్టిన రోజు సుంబురాలు చేసుకున్నాడు. ఈ సందర్బంగా సెహ్వాగ్‌కు మాజీ ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ‘హ్యాపీ 46 బర్త్ డే వీరూ.. 46 అంటే.. 4, 6 అని. నీ బ్యాటింగ్‌కు అద్దం పట్టేలా అలా చెప్పాను. నీ షాట్ల వలే ఈ ఏడాది కూడా విధ్వంసకంగా సాగాలని మనసారా కోరుకుంటున్నా’ అని సచిన్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.
Happy 46th, Viru! 46 ka matlab hai 4 aur 6 ka perfect mix—bilkul tumhari batting ki tarah. Koi bhagne ki zarurat nahi 😜.
Tumhara saal bhi tumhare shots ki tarah dhamakedaar ho! pic.twitter.com/syzvj8l33y— Sachin Tendulkar (@sachin_rt) October 20, 2024
భారత జట్టు తొలి టీ20 వరల్డ్ కప్(2007) గెలిచిన జట్టులో సభ్యుడైన సెహ్వాగ్ ఆ తర్వాత కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2002లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇక 2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో వీరూ చెలరేగి ఆడాడు. ధోనీ సారథ్యంలో వన్డే వరల్డ్ గెలుపొందిన జట్టులో సెహ్వాగ్ పాత్ర మరువలేనిది.
1. పాకిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన వీరూ.. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సచిన్ తర్వాత వీరూ ఈ ఘనత సాధించాడు. 2011లో వెస్టిండీస్ బౌలర్లను ఉతికేస్తూ 219 పరుగులతో చరిత్రకెక్కాడు.
“No matter who you are, I will show you who am I..!”
Trend Changer of Opening Batsman
Fearless Man 🏏
Happy Birthday @virendersehwag #HBDSehwag #Sehwag
— Amazing Deals 🛍️ (@dealshandle) October 20, 2024
2. సుదీర్ఘ ఫార్మాట్లోనూ దూకుడుగా ఆడిన సెహ్వాగ్ దేశం తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ కొట్టేశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ముల్తాన్ టెస్టులో శివాలెత్తిపోయిన వీరూ 309 పరుగులతో రికార్డులు బద్ధలు కొట్టేశాడు. అనంతరం 2008లో దక్షిణాఫ్రికాపై కూడా చెలరేగిన ఈ చిచ్చరపిడిగు మరోసారి మూడొందలు (319) బాదేశాడు.
Nothing much, just revisiting the six that helped Sehwag score his maiden triple ton in Test cricket 🤩
Is he the best ever Indian Test opener? pic.twitter.com/hAttQnJ8AT
— Wisden India (@WisdenIndia) May 26, 2021
3. వన్డేల్లో 8,586 పరుగులు.. టెస్టుల్లో 8,273 రన్స్ సాధించాడు. టెస్టుల్లో 23 శతకాలు బాదిన ఈ విధ్వంసక హిట్టర్.. వన్డేల్లో 15 సెంచరీలతో చెలరేగాడు.
4. ఓపెనర్‌గా తన ముద్ర వేసిన సెహ్వాగ్.. సచిన్‌తో కలిసి 3,919 పరుగులు జోడించాడు.