Womens T20 World Cup Final :మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ (Newzealand) భారీ స్కోర్ చేసింది. తొలి కప్ కలను నిజం చేసుకొనే దిశగా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా (South Africa)కు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ సుజీ బేట్స్(32) గట్టి పునాది వేయగా ఆల్‌రౌండర్ అమేలియా కేర్(43), బ్రూకే హల్లిడే(38)లు దంచి కొట్టారు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ చకచకా డబుల్స్, బౌండరీలు సాధించిన ఈ జోడీ 50కి పైగా భాగస్వామ్యంతో కివీస్‌ను ఆదుకుంది. ఈ ఇద్దరి జోరుతో న్యూజిలాండ్ 158 పరుగులు చేసింది.
టాస్ ఓడిన కివీస్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్(32), జార్జియా ప్లిమ్మర్(9)లు శుభారంభమిచ్చారు. ఇద్దరూ ధాటిగా ఆడడంతో ఓవర్‌కు 8 చొప్పున రన్స్ వచ్చాయి. అయితే.. ఈ జోడీని విడదీసి సఫారీలకు బ్రేకిచ్చింది. అనంతరం అమేలియా కేర్(43) జతగా బేట్స్ దంచింది. దాంతో, కివీస్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. అనంతరం సూజీ, కెప్టెన్ సోఫీ డెవిన్(6)లు తొందరగానే అయినా బ్రూకే హల్లిడే(38) అండగా అమేలియా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది.
A 50-run stand between Halliday and Kerr was the standout as New Zealand have runs on the board in a final 👏
🔗 https://t.co/7XCxeCUu1l | #T20WorldCup pic.twitter.com/fU3bIKy2kr
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2024
హల్లిడే, అమేలియా జోరుతో 15వ ఓవర్లో న్యూజిలాండ్ స్కోర్ 100 దాటింది. నాలుగో వికెట్‌కు 57 పరుగులు కలిపిన ఈ జోడీని ట్రయాన్ విడదీసింది. డేంజరస్ హల్లిడే వికెట్ పడడంతో సఫారీ జట్టు ఊపిరి పీల్చుకుంది. కానీ, లాబా వేసిన 19వ ఓవర్ తొలి రెండు బంతుల్ని బౌండరీకి పంపిన అమేలియా జట్టు స్కోర్ 140 దాటించింది. ఆఖరి ఓవర్లో మ్యాడీ గ్రీన్(12 నాటౌట్) సిక్సర్ బాదేసింది. దాంతో, కివీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 రన్స్ కొట్టింది.