Vikram | వైవిధ్యమైన సినిమాలు, డిఫరెంట్ గెటప్‌లు, ప్రయోగాత్మక కథలకు కేరాఫ్ అడ్రస్ తమిళ కథానాయకుడు విక్రమ్. తెలుగులో అపరిచితుడు, శివ పుత్రుడు చిత్రాలతో తన నటనతో అందరి హృ దయాలను గెలుచుకున్నాడు. ఆ తరువాత ఐ సినిమాలోనూ విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. రీసెంట్గా తంగలాన్‌తో మరోసారి తన పర్ఫార్మెన్స్తో అందరిని మెస్మరైజ్ చేశాడు. సినిమాలోని పాత్రల కోసం ఎంత రిస్క్‌నైనా తీసుకునే ఇండియన్ యాక్టర్స్‌లో విక్రమ్ ఒకరు. అయితే విక్రమ్ సినిమా రంగంలో స్థిరపడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఎన్నో ఫెయిల్యూర్స్ తరువాత సక్సెస్ రుచిని చూశాడు. అయితే విక్రమ్‌కు కాలేజీ రోజుల్లోనే సినీ రంగంపై మక్కువ వుండేది. కాలేజీల్లో నాటకాలు, డ్రామాలు ప్రదర్శించేవాడట. అయితే విక్రమ్ ఆ రోజుల్లోనే ఓ పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడట. ఆ వివరాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేశాడు చియాన్ విక్రమ్. ” కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో నాకు రాజ్ దూత్ బైక్ వుండేది. దాని మీద చేయని స్టంట్స్ లేవు. చాలా స్పీడుగా వెళుతుండేవాడ్ని. ఆ బైక్ మీదే వెళుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవాడిని. అయితే ఓ రోజు కాలేజీలో నాటకం వేసి వస్తుండగా, లారీ నా బైక్‌ను ఢీ కొట్టింది.నా రాజ్‌దూత్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఆ ప్రమాదం జరిగిన తీరు, నా బైక్‌ను చూసినవాళ్లంతా నేను పోయానేమో అనుకున్నారు.
మొత్తానికి అతికష్టంగా ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాను. కానీ బాగా గాయాలయ్యాయి. ముఖ్యంగా కాళ్లకు నడవలేని విధంగా దెబ్బలు తగిలాయి. ఇప్పట్లో నడవలేవు.. కనీసం నడవడానికి మూడేళ్లు పడుతుంది అన్నారు డాక్టర్లు. ఆసుపత్రిలో వున్నానని రోజులు నొప్పిని మరిచిపోవడానికి నాకొచ్చిన పాటలు పాడుకుంటు వుండేవాడ్ని. నా ఫేవరేట్ సినిమాల్లో డైలాగులు నేర్చుకుంటేవాడిని. నాకు అక్కడి డాక్టర్లు, నర్సుల కొద్ది రోజుల్లోనే ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక కోలుకోగానే మళ్లీ సినిమా అవకాశాల కోసం వేట మొదలుపెట్టాను” అని చెప్పుకొచ్చారు విక్రమ్.