Virender Sehwag: త్వరలో భారత పర్యటనకు రానున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. తమతో పాటు వ్యక్తిగత వంటగాడిని (చెఫ్) కూడా తీసుకురానుంది. ఈ మేరకు శనివారం ఉదయం ఇంగ్లండ్ క్రికెట్ ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది. జనవరి 25 నుంచి ఇంగ్లండ్.. హైదరాబాద్‌తో జరుగబోయే తొలి టెస్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మొదలుపెట్టనున్నది. సుమారు రెండు నెలల పాటు భారత్‌లో ఉండే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. బయట ఫుడ్ తిని అనారోగ్యం పాలుకాకుండా ఉండేందుకే టీమ్‌తో పాటు కుక్‌ను కూడా తెచ్చుకుంటోంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అభిమాన సంఘం అయిన ‘బర్మీ ఆర్మీ’ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది.
ఈ ట్వీట్‌పై వీరూ తాజాగా సెటైరికల్‌గా స్పందించాడు. ఇంగ్లండ్ దిగ్గజ సారథి అలిస్టర్ కుక్ రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టుకు మళ్లీ ‘కుక్’ అవసరం వచ్చిందని ట్వీట్ చేశాడు. ‘కుక్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్‌కు మళ్లీ ఆ అవసరం వచ్చింది. కానీ ఇది ఐపీఎల్లో మాత్రం వర్తించదు…’ అని ట్వీట్లో పేర్కొన్నాడు.
Yeh zaroorat Cook ke jaane ke baad padhi 😂
IPL mein nahi padegi. https://t.co/6DMWrN2not
— Virender Sehwag (@virendersehwag) January 6, 2024
వార్నర్ ఇక రీల్స్ చేసుకో..
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు కౌంటర్ ఇవ్వడంతో పాటు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్పైనా వీరూ ఫన్నీగా స్పందించాడు. ‘కంగ్రాట్యులేషన్స్ డేవిడ్ వార్నర్. అద్భుతమైన కెరీర్. నేను నిన్ను చూసినప్పుడే ఈ ఫార్మాట్ (టెస్టు) నీకు బాగా సూట్ అవుతుందని అనుకున్నా. అభిమానులను బాగా అలరించావు. ఇక నుంచి మరిన్ని రీల్స్ తో పాటు టీ20 క్రికెట్ ద్వారా అలరించు…’ అని ట్వీట్ చేశాడు.
Congratulations @davidwarner31 on a wonderful Test career. Since the time I saw you, knew this is the format you will excel most in and what a ride it has been. Full on entertainment on the pitch and now hopefully more in reels and T20 cricket. Best wishes for the next phase. pic.twitter.com/GSgIbXaH6N
— Virender Sehwag (@virendersehwag) January 6, 2024