Sehwag | భారత మాజీ క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. మైదానంలో బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే వీరూ.. మైదానం వెలుపల తనదైన సెటైర్లు వేస్తుంటాడు. ఇటీవల సోషల్ మీడియాలో వీరు చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. యాదాది జట్టు పాక్‌పై మాజీ క్రికెటర్ విరుచుకుపడ్డాడు. వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టుపై న్యూజిలాండ్ విజయం తర్వాత ‘బైబై పాకిస్థాన్’ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘పాకిస్థాన్ జిందా‘భాగ్’.. అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే, దీనిపై పాక్‌కు చెందిన మాజీలు విమర్శలు గుప్పించారు. ఈక్రమంలో తనపై వచ్చిన విమర్శలు సెహ్వాగ్ ధీటుగా తొప్పి కొట్టాడు. ఎక్స్ పోస్ట్‌లో రెండు స్త్రీన్ షాట్లను కలిపి పోస్ట్ చేశారు.
మొదటి స్ట్రీన్ షాట్లో 2022 జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నిష్క్రమణపై పాక్ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన పోస్టు ఉంది. అందులో ఆయన టీమిండియాను ట్రోల్ చేయగా.. దానిపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సైతం స్పందించారు. రెండో స్క్రీన్‌షాట్‌లో సెహ్వాగ్ పోస్టులున్నాయి. శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించిన అనంతరం వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇందులో ‘పాకిస్థాన్ జిందా‘భాగ్’.. మీ జాతకం ఏంటో మీరు ఏ జట్టుకు సప్ట్ చేసినా వాళ్లు సైతం మీలాగే ఆడతారు’ అంటూ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలో సెహ్వాగ్ మరోసారి ఘాటుగానే స్పందించాడు. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేశాడు. ‘21వ శతాబ్దంలో ఆరు వన్డే వరల్డ్ కప్‌లు జరిగాయి. ఇందులో భారత జట్టు 2007 వరల్డ్ కప్‌లో మినహా మిగతా ఐదు టోర్నీలో సెమీస్ చేసింది. పాక్ జట్టు ఆరింట్లో ఒకేసారి 2011లో సెమీస్‌కు చేరింది. మళ్లీ వారు భారత జట్టు ఆటను చూసి తట్టుకోలేక బాల్ మారుస్తున్నారని, పిచ్ మారుస్తున్నారంటూ ఐసీసీ, బీసీసీపై ఆరోపణలు చేస్తున్నారు. గత టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై గెలిచి.. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాక్ ప్రధాని కూడా వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
ఇక్కడికి వచ్చిన తర్వాత పాక్ ప్లేయర్లు హైదరాబాద్‌లో టీ ఎంజాయ్ చేస్తున్నామంటూ.. భారత సైనికులను ట్రోల్ చేశారు. పీసీబీ చీఫ్ అయితే ఏకంగా భారత్‌ని శత్రుదేశం అంటూ కెమెరా ముందే మాట్లాడాడు. వాళ్లు చేయాల్సిదంతా చేసి, మేం మంచిగా ఉండాలంటే ఎలా..? మర్యాద అనేది ఇచ్చి, పుచ్చుకోవాలి. మీరు మంచిగా ఉంటే.. మీతో మేం చాలా మంచిగా ఉంటాం. లేకుంటే ఇలాగే ప్రవర్తిస్తే సరైన సమయంలో వడ్డీతో తిరిగి చెల్లిస్తాం. మైదానంలోనైనా.. మైదానం వెలుపల అయినా’ అంటూ సెహ్వాగ్ ధీటుగా బదులిచ్చాడు.
In the 21st century there have been 6 ODI world cups.
In 6 attempts, only once in 2007 did we not qualify for the semi-finals and have qualified in 5 of the last 6 World cups. On the other hand only once have Pakistan qualified for the semis in 6 attempts in 2011.
And they come… pic.twitter.com/W7U67pBrFU— Virender Sehwag (@virendersehwag) November 11, 2023