న్యూఢిల్లీ: సోషల్‌మీడియాలో పోస్ట్‌ల ద్వారా రికార్డు స్థాయిలో ఆర్జిస్తున్నట్లు వస్తున్న వార్తలపై టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీ స్పష్టత ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌తో కోహ్లీకి రూ.11.4 కోట్లు వస్తున్నాయంటూ వార్తల నేపథ్యంలో విరాట్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికంగా ఆదాయాన్ని సంపాదిస్తున్న వారి జాబితాలో తాను ఉన్నట్లు వచ్చిన వార్తను స్టార్ క్రికెటర్ ఖండించాడు.