Virat Kohli : వన్డే ప్రపంచకప్‌లో ఆడనున్న భారత పురుషుల హాకీ జట్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘వరల్డ్ కప్‌లో బరిలోకి దిగుతున్న భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వెళ్లండి. ఆటను ఆస్వాదించండి. మేమందరం మీకు మద్దతుగా ఉన్నాం. గుడ్ లక్ అంటూ ‘కోహ్లీ ట్వీట్టర్లో రాసుకొచ్చాడు. స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించాలని అతను ఆకాంక్షించాడు. అంతేకాదు భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్, శ్రేయాస్ అయ్యర్ కూడా హాకీ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘నా హాకీ, నా గౌరవం.. ఇండియా దూసుకెళ్లు’ అని గంబీర్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ‘వరల్డ్ కప్ ఆడుతున్న మన హాకీ జట్టుకు గుడ్ లక్’ అని అయ్యర్ ట్వీట్ చేశాడు.
ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలాలో వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. మొత్తం 16 టీమ్‌లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. గ్రూప్ డిలో ఉన్నభారత్ జట్టు ఈ రోజు తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది. గ్రూప్ డిలో వేల్స్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. జనవరి 29న ఫైనల్ జరగనుంది. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. స్వదేశంలో ట్రోఫీ అందుకోవాలనే పట్టుదలతో ఉంది.
కొత్త ఏడాదిని విరాట్ కోహ్లీ సెంచరీతో ఆరంభించాడు. శ్రీలంకపై తొలి వన్డేలో113 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో 45వ, అంతర్జాతీయ క్రికెట్లో 73 సెంచరీ నమోదు చేశాడు. రెండో వన్డేలో మాత్రం 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. మూడో వన్డే జనవరి 15న తిరువనంతపురంలో జరగనుంది.
My best wishes to our Indian men’s hockey team for the World Cup. Go and enjoy yourself, we all are backing you. Good luck. 🇮🇳💪
— Virat Kohli (@imVkohli) January 13, 2023
My Hockey, my pride! Let’s go India! 🇮🇳🇮🇳 #HockeyWorldCup2023
— Gautam Gambhir (@GautamGambhir) January 13, 2023
Good luck to our men’s hockey team for the World Cup 🇮🇳 pic.twitter.com/XpZ3sBbjVX
— Shreyas Iyer (@ShreyasIyer15) January 13, 2023