న్యూ శాయంపేట, డిసెంబరు 25 : గ్రేటర్ పరిధి 31 డివిజన్ న్యూ శాయంపేట నందిహిల్స్లోని శ్రీజ అపార్ట్మెంట్లో శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు. అయ్యప్పమాల ధారులు సిహెచ్ రవీందర్ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా పడిపూజ జరిగింది.
18 మెట్లతో కూడిన పడికి, అయ్యప్పస్వామి చిత్రపటంతో పాటు విఘ్నేశ్వరుడు, లక్ష్మిదేవి చిత్రపటాలను అందంగా అలంకరించారు. పూజారి నాగిళ్ల శరత్ మంత్రోశ్చరణాలతో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ ఆట పాటలతో.. భక్తి శ్రద్ధలతో కొలిచారు. అయ్యప్ప స్వామి శరణుఘోషతో ఆ ప్రాంతమంత మార్మోగింది. పడి పూజలో గురు స్వాములు దాసరి శంకర్, వెల్దండి శ్రీధర్ రాసమల్ల రాజు, గోపుసదానందం, పసునూటి రాజేష్, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.