ముంబై: రాబోయే ఐపీఎల్ సీజన్(2025)కు చెందిన ప్లేయర్ల రిటెన్షన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. గురువారమే రిటెన్షన్‌కు చివరి తేదీ. దీంతో పలు ఫ్రాంచైజీలు కొత్త ప్లేయర్ల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం పాత ఫ్రాంచైజీలకే ఫిక్స్ అయ్యేందుకు సిద్ధపడ్డారు. ఇక బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు .. విరాట్ కోహ్లీ(Virat Kohli) కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021లో ఆర్సీబీ కెప్టెన్సీని విరాట్ వదులుకున్నాడు. ఆ తర్వాత నుంచి డూప్లిసిస్ ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే ఈసారి కొత్త కెప్టెన్ కోసం ఆర్సీబీ ప్రయత్నించినట్లు తెలిసింది. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభమన్ గిల్‌ను ఆర్సీబీకి రప్పించే ప్రయత్నాలు జరిగాయి. కానీ గిల్ తన పాత ఫ్రాంచైజీతో కొనసాగేందుకు మొగ్గుచూపినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయి.