హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఏడాది క్రితం అతను ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. ఓ దశలో పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. తీవ్ర స్థాయిలో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో టెస్ట్ కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్లీ తన పాత ఫామ్‌ను చూపిస్తున్నాడు. దూకుడు బ్యాటింగ్ శైలితో టీమిండియాలో కోహ్లీ కొత్త ఉత్తేజాన్ని నింపాడు. దీనికి కారణాన్ని వెల్లడించాడు స్టార్ క్రికెటర్ కోహ్లీ. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సమయంలో మాజీ క్రికెటర్ ధోనీ నుంచి వచ్చిన మెసేజ్ తనను పూర్తిగా మార్చేసిందని కోహ్లీ తెలిపాడు. ఆర్సీబీ పోడ్క్యాస్ట్తో మాట్లాడుతూ కోహ్లీ ఆ రహస్యాన్ని వెల్లడించారు.
టెస్ట్ కెప్టెన్సీ వదిలేసిన సమయంలో తనకు పరిచయం ఉన్న ఆటగాళ్లలో ధోనీ ఒక్కడే తనకు మెసేజ్ చేశాడని కోహ్లీ చెప్పాడు. తన నెంబర్ చాలా మంది వద్ద ఉన్నా.. అతనొక్కడే తనకు సందేశం పంపినట్లు కోహ్లీ తెలిపాడు. తమ ఇద్దరి మధ్య ఎనలేని గౌరవం ఉందని, తమ మధ్య ఎటువంటి అభద్రతాభావం లేదని కోహ్లీ చెప్పాడు. ధోనీ తనకు మెసేజ్ చేశాడని, సీనియర్ ఆటగాడితో తనకు బలమైన అనుబంధం ఉండడం దీవెనగా భావిస్తున్నాని కోహ్లీ అన్నాడు. ధోనీ తన మెసేజ్‌లో ఏం చెప్పాడో కూడా వెల్లడించాడు కోహ్లీ. బలంగా ఉండాలనుకున్నప్పుడు, బలమైన వ్యక్తిగా కనిపించాలనుకున్నప్పుడు, నువ్వు ఎలా ఆడుతున్నావన్న విషయాన్ని ప్రజలు ఆడగలేరని ధోనీ తన మెసేజ్‌లో చెప్పినట్లు కోహ్లీ తెలిపాడు.
ధోనీ పంపిన సందేశం తనను బలంగా తాకిందని కోహ్లీ అన్నాడు. తాను ఎలాంటి వాడినో తనకు తెలుసు అని, చాలా నమ్మకంగా ఉండేవాడినని, మానసికంగా ధైర్యంగా ఉండేవాడినని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేవాడినన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వాస్తవాలను తెలుసుకోవాలని, కొన్ని అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుందని, ఎలా రాణిస్తున్నామన్న విషయాన్ని అవగాహన చేసుకోవాలన్నారు.
ఫామ్ కోల్పోయిన సమయంలో బ్రేక్ తీసుకున్న తర్వాత.. ఆసియా కప్‌తో కోహ్లీ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ టోర్నీలో అతను పరుగులు పారించాడు. రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ కూడా చేశాడు. ఇక ఇప్పుడు జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌తో కోహ్లీ తన సత్తా చాటుతున్నాడు. సూపర్12 రౌండ్ ముగిసిన తర్వాత .. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. నాకౌట్ దశలోనూ తన దూకుడును ప్రదర్శించేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు.