Virat Kohli : రాంచీ వన్డేలో సూపర్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ(Virat Kohli) కీలక నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్న విరాట్.. దేశవాళీ క్రికెట్(Domestic Cricket) ఆడేందుకు ఎట్టకేలకు అంగీకరించాడు. రాంచీలో ఆదివారం తొలి వన్డే అనంతరం బహుమతి ప్రదానం సమయంలో నేను 100 శాతం ఫిట్‌గా ఉంటే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం లేదని చెప్పిన విరాట్ మంగళవారం తన నిర్ణయం మార్చుకున్నాడు. పదిహేనేళ్ల తర్వాత దేశవాళీలో బరిలోకి దిగేందుకు ఓకే చెప్పేశాడు.
టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్ ఒక్కదాంట్లోనే కొనసాగుతున్నాడు. ఫిట్నెస్ పరంగా ఢోకాలేని అతడు.. రాంచీ వన్డేలో 52వ శతకంతో ఫామ్ కూడా చాటుకున్నాడు. అయినా సరే వన్డే వరల్డ్ కప్ ఆడిస్తామని సెలెక్టర్లు, బీసీసీఐ నుంచి గ్యారెంటీ ఇవ్వడం లేదు. దాంతో.. ప్రపవంచకప్ సన్నద్దతలో భాగంగా దేశవాళీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు విరాట్. మంగళవారం ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ సంఘానికి తెలియజేశాడు కోహ్లీ. తాను విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) స్క్వాడ్ ఎంపికకు అందుబాటులో ఉంటానని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీకి భారత స్టార్ సమాచారమిచ్చాడు. ఈ విషయాన్ని సెక్రటరీ అశోక్ శర్మ ధ్రువీకరించాడు.
.@imVkohli is all set to play domestic cricket for Delhi again! 🏟
“He will definitely play a few games, but not sure about the entire Vijay Hazare Trophy.” DDCA secretary Ashok Sharma told @ESPNcricinfo 🔊
WATCH HIM NEXT 👉 #INDvSA 2nd ODI 👉 WED, 3rd DEC, 12:30 PM pic.twitter.com/3n5jQFCBwy
— Star Sports (@StarSportsIndia) December 2, 2025
విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతానని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీతో కోహ్లీ చెప్పాడు. స్క్వాడ్ ఎంపిక సమయంలో తన పేరును పరిగణించాలని అతడు కోరాడు అని అశోక్ శర్మ తెలిపాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగే విజయ్ హజారే ట్రోపీలో ఢిల్లీ డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది. విరాట్ చివరిసారిగా 2010లో ఢిల్లీ – సర్వీసెస్ మ్యాచ్‌లో ఆడాడు. 2013 నుంచి అతడు లిస్ట్ ఏ గేమ్స్ ఆడడం లేదు.