దుబాయ్: ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి చేరాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 817 పాయింట్లతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తుండగా బాబర్ ఆజమ్ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుసగా 3,4 స్థానాల్లో నిలిచారు.
గతవారంతో పోల్చితే ఒక ర్యాంకును మెరుగుపర్చుకున్న కోహ్లీ.. ఐదో స్థానంలోకి వచ్చాడు. టాప్-10లో భారత్ నుంచి గిల్, రోహిత్, కోహ్లీతో పాటు 9వ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. బౌలర్ల జాబితాలో కుల్దీప్ యాదవ్ (3వ స్థానం) ఒక్కడే భారత్ నుంచి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.