న్యూఢిల్లీ: ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీయాలని కలలు కనే బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటిది తన తొలి వికెటే ఆ కింగ్ కోహ్లిది అయితే ఆ బౌలర్ ఆనందానికి అవధులు ఉండవు. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ ఇప్పుడు అదే ఆనందంలో ఉన్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన హర్‌ప్రీత్‌కు.. ఐపీఎల్లో తొలి వికెట్ విరాట్ కోహ్లిదే కావడం విశేషం. అతనితోపాటు మ్యాక్స్‌వెల్, డివిలియర్స్‌లాంటి కీలక బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసి పంజాబ్‌కు విజయం ఖాయం చేశాడతడు.
బ్యాట్‌తోనూ 17 బంతుల్లోనే 25 పరుగులు చేసి రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఆనందం నుంచి తేరుకోక ముందే సాక్షాత్తూ తాను ఔట్ చేసిన కింగ్ కోహ్లియే తనను మెచ్చుకోవడం హర్‌ప్రీత్‌ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ తర్వాత కోహ్లి.. అతనికి దగ్గరికి వెళ్లి వెన్నుతట్టి శెభాష్ అని మెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తన తొలి వికెటే కోహ్లిది కావడం చాలా స్పెషల్ అని మ్యాచ్ తర్వాత హర్‌ప్రీత్ అన్నాడు. ఇది చూసి తన ఊరి వాళ్లు ఎంతో గర్వంగా ఫీలై ఉంటారని అన్నాడు. కోహ్లిని ఔట్ చేసిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయి అదే ఊపులో బౌలింగ్ చేశానని చెప్పాడు.
First, the wicket & then, the appreciation from the man himself! 🤝@thisisbrar will surely cherish this moment with @imVkohli! 😊#VIVOIPL #PBKSvRCB pic.twitter.com/ovXmadbyKN
— IndianPremierLeague (@IPL) April 30, 2021