దుబాయ్: ఐపీఎల్ ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. ఈ సీజన్ ముగియగానే విరాట్ కోహ్లి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు. యూఏఈ అంచె టోర్నీ ప్రారంభానికి ముందు ఈ నిర్ణయాన్ని ప్రకటించిన విరాట్.. తాజాగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో చెప్పాడు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అతడు వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా కెప్టెన్సీ వదిలేయడంపై స్పందిస్తూ.. ప్రధానంగా పనిభారం అనేది కెప్టెన్సీ వదిలేయడానికి ముఖ్య కారణం. ఇక నా బాధ్యతల విషయంలో నేను నిజాయతీ లేకుండా వ్యవహరించలేను. దేనికైనా నేను నా 120 శాతం ఇవ్వలేకపోయిన సందర్భంలో దానినే పట్టుకొని వేలాడే వ్యక్తిని కాను. ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది అని అన్నాడు. 2013లో ఆర్సీబీ కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడు ఐపీఎల్ ట్రోఫీ అందించలేకపోయాడు.
Curious to know what prompted @imVkohli to step down from captaincy? 🤔
— Star Sports (@StarSportsIndia) October 10, 2021
The #RCB skipper reveals the reason on #InsideRCB:
Tomorrow, 8:30 AM & 12 PM | Star Sports 1/1HD/2/2HD pic.twitter.com/rqcIdonx5o