పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు టీమిండియా రెఢీ అవుతున్నది. నవంబర్ 22వ తేదీ నుంచి పెర్త్‌లో తొలి టెస్టు జరగనున్నది. అయితే ఆ టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వాకా మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పాల్గొన్నాడు. పూర్తి స్థాయిలో ట్రైనింగ్ సెషన్ జరిగింది. అయితే ఆ ప్రాక్టీస్ సెషన్‌ను చూసేందుకు స్థానిక క్రికెట్ అభిమానులు ఎగబడినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీని చూసేందుకు భారీ సంఖ్యలో జనం వచ్చినట్లు తెలుస్తోంది. కొందరైతే చెట్లు ఎక్కి మరీ కోహ్లీ ప్రాక్టీస్ చూశారట. ఇంకొందరు ఏకంగా తమ స్వంత నిచ్చెనలు తెచ్చుకున్నట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది.
శుక్రవారం నుంచి ఆదివారం జరిగే ప్రాక్టీస్ సెషన్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత జట్టు యాజమాన్యం క్రికెట్ ప్రేక్షకులకు అవకాశం కల్పించింది. మ్యాచ్ ప్రాక్టీస్‌లో భాగంగా ఇండియా-ఏ జట్టుతో.. వాకా మైదానంలో భారత సీనియర్ జట్టుతో ఆడనున్నది. అయితే విజిటింగ్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను సాధారణ ప్రజలు వీక్షించడానికి ఆస్ట్రేలియాలో అనుమతి ఇవ్వరు. కానీ ఆ ఆంక్షలకు విరుద్ధంగా ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Virat Kohli in the practice session at WACA, Perth 🐐🔥 pic.twitter.com/XxZyf5M9Dy
— Virat Kohli Fan Club (@Trend_VKohli) November 14, 2024