రికార్డుల రారాజు, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. తన కెరీర్లో వందలాది రికార్డులను బద్దలుకొడుతూ వస్తున్న కోహ్లీ.. ఇటీవలే ఆసియా కప్‌లో 71వ సెంచరీ చేసి సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు నిలిచిన రెండో ఆటగాడిగా రికీ పాంటింగ్‌తో సమానంగా నిలిచాడు. ఇక నేటి నుంచి మొదలుకాబోయే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా కోహ్లీ మరో 63 పరుగులు చేస్తే చాలు. టీమిండియా హెడ్‌కోచ్, భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ అత్యధిక పరుగుల రికార్డు చెరిగిపోనుంది.
ప్రస్తుతం భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల (అంతర్జాతీయ స్థాయిలో) జాబితాలో సచిన్ టెండూల్కర్ ముందున్నాడు. సచిన్.. 664 మ్యాచ్‌లలో 34,357 పరుగులు చేశాడు. రెండో స్థానంలో రాహుల్ ద్రావిడ్.. 509 మ్యాచ్‌లలో 24,064 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ.. 468 మ్యాచ్‌లలో 24,002 రన్స్ చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ మరో 63 పరుగులు చేస్తే ద్రావిడ్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలుకొడతాడు.
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కోహ్లీ.. ఆసియా కప్‌లో ఫామ్‌ను కొనసాగిస్తే ద్రావిడ్ రికార్డును చెరిపేయడం కష్టమేమీ కాదు. ఆసియా కప్‌కు ముందు ఫామ్ లేమితో సతమతమైన కోహ్లీ.. ఈ మెగా టోర్నీలో మునపటి ఫామ్ అందుకున్నాడు. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. గ్రూప్ దశలో పాకిస్తాన్, ఐర్లాండ్‌తో పాటు సూపర్-4లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ పై రాణించాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ (122)తో చెలరేగిన విషయం తెలిసిందే.