Virat Kohli : గత ఏడాది ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్లో దంచి కొడుతున్నాడు. ఐపీఎల్ అంటే చాలు.. శివాలెత్తిపోయే ఈ ఛేజ్ మాస్టర్ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 600 ఫోర్లు బాదిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లీ 5 బౌండరీలు కొట్టాడు. దాంతో, ఆరొందల ఫోర్లు క్లబ్లో చేరాడు.
కోహ్లీ 229 మ్యాచుల్లో 603 బౌండరీలు సాధించాడు. ఈ లీగ్‌లో అత్యధిక ఫోర్లు కొట్టింది ఎవరో తెలుసా.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan). అతను 730 బౌండరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. గబ్బర్ 210 మ్యాచుల్లో ఈ ఫీట్‌కు చేరువయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(David Warner) 608 ఫోర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
Another day, another milestone 😉
6⃣0⃣0⃣ fours now in #TATAIPL for @imVkohli 🫡
Follow the match ▶️ https://t.co/CQekZNsh7b#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/HzFwFdGmeA
— IndianPremierLeague (@IPL) April 20, 2023
సూపర్ ఫామ్‌లో ఉన్న కింగ్ కోహ్లీ ఐపీఎల్ 16వ సీజన్లో జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. కెప్టెన్ డూప్లెసిస్‌తో కలిసి శుభారంభాలు ఇస్తున్న అతను జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెలరేగిన విరాట్ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై (62) అర్థశతకంతో రాణించాడు. కానీ, నికోలస్ పూరన్ (62) సంచలన బ్యాటింగ్ చేయడంతో లక్నో 1 వికెట్ తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోహ్లీ (50) హాఫ్ సెంచరీ బాదాడు. ఈరోజు పంజాబ్ కింగ్స్‌పై కూడా కోహ్లీ(59) ఫిఫ్టీతో రాణించాడు.