హైదరాబాద్ : మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తన ఏడేళ్ల కూతురు షారోన్ మేరీని మూడవ అంతస్తు పైనుండి కిందకు పడేసింది కన్న తల్లి. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది. మల్కాజ్గిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు 20 ఏండ్లుగా స్థానిక వసంత్పురి కాలనీలో ఉంటున్నారు. తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. పాప తల్లి చాలా రోజులుగా మానసిక సమస్యలతో బాద పడుతున్నట్లు సమాచారం.
సోమవారం సాయంత్రం తాము నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌పైకి బిడ్డను తీసుకెళ్లిన తల్లి బిల్డింగ్‌పైనుంచి కిందకు తోసేయగా పక్క బిల్డింగ్ మెట్లపై పడిన బాలిక తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు పాపను వెంటనే గాంధీ అసుపత్రికి తరలించారు. గాయపడిన చిన్నారికి వైద్యులు చికిత్స చేస్తుండగా కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది.