హైదరాబాద్: ఈ ఏడాది ఐపీఎల్(IPL2023)లో ఇప్పటికే 27 మ్యాచ్‌లు ముగిశాయి. అయితే ఈ టోర్నీలో కొందరు ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు. అసలు ఏమాత్రం తన ట్యాలెంట్ ప్రదర్శించలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw)ను 8 కోట్లు పెట్టి కొన్నారు. కానీ అతను ఈ ఏడాది నిరుత్సాహపరిచాడు. రిషబ్ పంత్ లేని కారణంగా, పృథ్వీ షా రాణిస్తాడని ఆశించారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచుల్లో అతను కేవలం 34 రన్స్ మాత్రమే చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌లో మరో ప్లేయర్ కూడా నిరాశపరిచాడు. సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) రెండు మ్యాచ్‌లే ఆడాడు. ఆ రెండు మ్యాచుల్లో అతను 34 రన్స్ చేశాడు. దేశవాళీ సీజన్లో టాప్ ఫామ్ కనబరిచిన సర్ఫరాజ్ .. ఐపీఎల్లో మాత్రం చేతులెత్తేశాడు.
రియాన్ పరాగ్(Riyan Parag)పై రాజస్తాన్ రాయల్స్ గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సీజన్లో అతను ఆశించిన రీతిలో రాణించలేదు. 5 మ్యాచుల్లో అతను 54 రన్స్ చేశాడు. ఈ యేటి ఐపీఎల్లో అతని ఫెయిల్ అయ్యాడు.
కృనాల్ పాండ్యా(Krunal Pandya) కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలేదు. ఆరు మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం 80 రన్స్ మాత్రమే కొట్టాడు. లక్నో జట్టు అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవడం లేదు. 8.25 కోట్లు పెట్టి కొన్న కృనాల్ మరింత ధీటైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.
ఆయుష్ బదోనీ(Ayush Badoni) గత ఏడాది ఐపీఎల్లో మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ ఈసారి అతను ఇబ్బందిపడుతున్నాడు. 6 మ్యాచుల్లో బదోనీ కేవలం 77 రన్స్ మాత్రమే చేశాడు. లక్నో జట్టు అతని రిట్నర్ కోసం ఎదురుచూస్తోంది.