విరాట్ ట్విట్టర్ ఫ్యాన్స్ @5 కోట్లు
విరాట్ కోహ్లీ..ఈ పేరు వింటే క్రికెట్ అభిమానులు మైమరిచిపోతారు. సామాజిక మాధ్యమాల్లో కోహ్లీకి అభిమానుల కొదవలేదు. తాజాగా ట్విట్టర్లో కోహ్లీని అనుసరించే అభిమానుల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది.
ముంబై : విరాట్ కోహ్లీ..ఈ పేరు వింటే క్రికెట్ అభిమానులు మైమరిచిపోతారు. సామాజిక మాధ్యమాల్లో కోహ్లీకి అభిమానుల కొదవలేదు. తాజాగా ట్విట్టర్లో కోహ్లీని అనుసరించే అభిమానుల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా అతడు నిలిచాడు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తనకు ఎదురులేదని ఈ టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ నిరూపించాడు. వేర్వేరు సామాజిక మాధ్యమాలు కలుపుకుని విరాట్‌ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య 21.1 కోట్ల పైనే ఉండటం విశేషం. తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై అజేయ సెంచరీతో అదరగొట్టి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ పాంటింగ్‌తో సమంగా అంతర్జాతీయ క్రికెట్లో 71 సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

