బెంగుళూరు: ఇండియన్ బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైలురాయిని అతను దాటేశాడు. లిస్టు ఏ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 16వేల రన్స్ చేసిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు స్థాపించాడు. విరాట్ కేవలం 330వ ఇన్నింగ్స్‌లో ఆ మైలురాయిని అందుకున్నాడు. విజయ్ హజారా ట్రోఫీ వన్డే టోర్నీలో ఆడుతున్న కోహ్లీ.. ఇవాళ ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ క్రమంలో లిస్ట్ ఏ క్రికెట్లో 16వేల పరుగుల మైలురాయిని దాటాడు.
గతంలో టెండూల్కర్ 391 ఇన్నింగ్స్‌లో ఆ స్కోరు చేశాడు. బెంగుళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో జరుగుతున్న మైదానంలో కోహ్లీ శరవేగంగా రన్స్ రాబట్టాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే టోర్నీలో కోహ్లీ ఆడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ పేరిట గతంలో మంచి రికార్డు ఉన్నది. అతను 13 మ్యాచుల్లో 68 సగటుతో 819 రన్స్ చేశాడు. వీటిల్లో నాలుగు సెంచరీలు, మూడు ఫిఫ్టీలు ఉన్నాయి.
టెస్టు, టీ20 క్రికెట్ నుంచి కోహ్లీ రిటైరైన విషయం తెలిసిందే. అయితే జనవరి 11 నుంచి కివీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌పై కోహ్లీ కన్నేసినట్లు తెలుస్తోంది.