అడిలైడ్: స్టార్ వన్డే బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) వరుసగా రెండో సారి డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో అతను పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. వన్ డౌన్లో వచ్చిన కోహ్లీ కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి బార్ట్లెట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ సిరీస్‌లో కోహ్లీకి ఇది రెండో డకౌట్. పెర్త్ వన్డేలోనూ అతను రన్స్ చేయకుండానే వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్ బౌలర్ బార్ట్లెట్ ఆ ఓవర్లో రెండు వికెట్లను తీసుకున్నాడు. కెప్టెన్ శుభమన్ గిల్ కూడా ఆ ఓవర్లోనే ఔటయ్యాడు.
కోహ్లీకి అనుకూలించే అడిలైడ్ పిచ్‌పై అతను రాణించలేకపోయాడు. ప్లంబ్ ఎల్బీ కావడం.. కోహ్లీ వీక్నెస్ను బయటపెట్టింది. రివ్వ్యూ తీసుకునే ఆలోచన చేయకుండానే క్రీజ్ వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. మైదానం విడిచి వెళ్తున్న సమయంలో బౌండరీలైన్ వద్ద ప్రేక్షకులకు తన గ్లౌజ్‌తో కోహ్లీ అభివాదం చేస్తూ వెళ్లిపోయాడు. తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇండియా 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 32 రన్స్ చేసింది. రోహిత్ 20, శ్రేయాస్ 2 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
HEART BREAK FOR ADELAIDE FANS 💔
– They have given a Standing ovation for Kohli & he thanked them. pic.twitter.com/TuKqmNRTEj
— Johns. (@CricCrazyJohns) October 23, 2025