ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 178 పరుగుల ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుగా ఆడుతోంది. ఛేదనలో కోహ్లీసేనకు అదిరే ఆరంభం లభించింది. బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ బౌండరీలతో విరుచుకుపడుతున్నాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. పడిక్కల్ దంచికొట్టడంతో పవర్‌ప్లే ఆఖరికి 59 పరుగులు రాబట్టింది. దేవదత్ 27 బంతుల్లోనే అర్ధశతకంపూర్తి చేసకున్నాడు. ఈ ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు రాజస్థాన్ బౌలర్లు శ్రమిస్తున్నారు. 8 ఓవర్లకు బెంగళూరు వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. పడిక్కల్(59), కోహ్లీ(21) క్రీజులో ఉన్నారు.
FIFTY!@devdpd07 with a quick-fire half-century here at The Wankhede.
— IndianPremierLeague (@IPL) April 22, 2021
Live – https://t.co/dch5R4juzp #RCBvRR #VIVOIPL pic.twitter.com/NatlgRgusS