Virat Kohli | టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ కావాలనే తన నిర్ణయంపై తొలిసారి విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించాడు. ఈ నెల లండన్‌లో యువరాజ్ సింగ్ నిర్వహించిన ఛారిటీ కార్యక్రమంలో విరాట్ పాల్గొన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విరాట్ రిటైర్మెంట్ ప్రకటన అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులను సైతం షాక్‌కు గురి చేసింది. 36 ఏళ్ల వయసున్నా ఫిట్‌గా ఉన్న క్రికెటర్లలో ఒకడు. ఇంకా చాలా సంవత్సరాలు ఆడగలడని చాలామంది క్రికెట్ పండితులు పేర్కొంటారు. టెస్ట్ క్రికెట్ మరో పదివేల పరుగులు చేయగల సత్తా విరాట్‌కు ఉందని విశ్వసిస్తారు. ఈ వెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన గౌరవ్ కపూర్ విరాట్‌ను స్టేజీపైకి ఆహ్వానించారు.
మైదానంలో చాలామంది విరాట్‌ను మిస్ అవుతున్నారని.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించాడు. విరాట్ మాట్లాడుతూ తన వయసే రిటైర్మెంట్లో కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. ‘నేను రెండు రోజుల కిందట నా గడ్డానికి రంగు వేసుకున్నాను. మీరు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మీ గడ్డానికి రంగు వేసుకునే సమయం వచ్చిందంటే రిటైర్మెంట్ పలకాల్సిన సమయం వచ్చిందని అర్థం’ అంటూ అందరినీ నవ్వించాడు విరాట్. ఈ సందర్భంగా విరాట్ మాజీ కోచ్ రవిశాస్త్రికి ధన్యవాదాలు తెలిపాడు. టెస్ట్ కెరియర్ను తీర్చిదిద్దడంలో శాస్త్రి కీలకపాత్ర పోషించారని, ఆయన లేకుంటే టెస్ట్ క్రికెట్లో తాను ఏమీ సాధించలేకపోయేవాడనని చెప్పుకొచ్చాడు. యువరాజ్‌తో తన స్నేహంపై స్పందిస్తూ.. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు భారత జట్టులో కొత్తగా ఉన్నప్పుడు యువరాజ్ తనకు ఎంతగానో సహాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు.
‘మేం మైదానం లోపల, వెలుపల చాలా మంచి సంబంధాలున్నాయి. భారతదేశం తరఫున ఆడడం మొదలుపెట్టినప్పుడు యూవీ పా, భజ్జీ, జాక్ తనకు అండగా నిలిచారు’ అని తెలిపాడు. క్యాన్సర్‌తో పోరాడి కోలుకున్న తర్వాత కటక్‌లో ఇంగ్లండ్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పునరాగమనం చేశాడని, ఆ సమయంలో తాను కెప్టెన్’ అని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నా బాల్యంలోకి వెళ్లి నేను మళ్లీ క్రికెట్ చూసినట్లుగా అనిపించిందని విరాట్ పేర్కొన్నారు. యువరాజ్‌పై ప్రేమ, గౌరవం ఉందని చెప్పాడు. ఈ కార్యక్రమంలో హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండుల్కర్, బ్రియాన్ లారా, కెవిన్ పీటర్సన్, డారెన్ గోఫ్, మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. రోకో రిటైర్మెంట్ నేపథ్యంలో టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింగి. హెడింగ్లీ మ్యాచ్‌లో ఓటమిపాలైనా.. ఎడ్జ్‌బాస్టన్‌లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.