అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (452 ఇన్నింగ్స్‌లలో 18,426 రన్స్) తర్వాత రెండో స్థానం (293 ఇన్నింగ్స్‌లలో 14,255)లో నిలిచాడు. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్.. కుమార సంగక్కర (380 ఇన్నింగ్స్‌లలో 14,234)ను అధిగమించి ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో పాంటింగ్, జయసూర్య టాప్-5లో ఉన్నారు.