పుణె: విరాట్ కోహ్లీ(Virat Kohli) బౌలర్‌గా మారాడు. బంగ్లాదేశ్‌తో పుణెలో జరుగుతున్న మ్యాచ్‌లో అతను బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో హార్దిక్ పాండ్యా గాయపడడంతో.. విరాట్ మిగితా బంతుల్ని పూర్తి చేశాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత అతను వన్డేల్లో తొలి సారి బౌల్ చేశాడు. మూడు బంతుల్లో అతను రెండు రన్స్ ఇచ్చాడు.
Virat Kohli bowling!!!!
Right Arm Quick Bowler in Action 😂🔥#ViratKohli | #WorldCup2023 |#INDvsBAN |#CricketWorldCup2023 | #CricketWorldCup pic.twitter.com/mcQBxHQ3s7
— CSK ARMY 🦁 (@Bikrant51950320) October 19, 2023
లింటన్ దాస్ కొట్టిన షాట్‌ను కాలుతో ఆపబోయిన హార్దిక్ మడిమకు గాయమైంది. తట్టుకోలేని నొప్పితో బాధపడుతున్న హార్దిక్‌ను ఫిజియో ఫీల్డ్ నుంచి తీసుకెళ్లాడు. మూడు బంతులు వేసిన హార్దిక్‌ను తప్పించడంతో.. మిగితా మూడు బంతుల్ని విరాట్ వేశాడు.
Virat Kohli the bowler 👀#CWC23 | #INDvBAN pic.twitter.com/KSOfWE5Urx
— ICC (@ICC) October 19, 2023