Virat Kohli: భారత క్రికెట్ జట్టు వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ త్వరలోనే 35వ పడిలోకి అడుగిడబోతున్నాడు. నవంబర్ 5న అతడి పుట్టినరోజు అన్న సంగతి కోహ్లీ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అయితే ఈసారి కోహ్లీ బర్త్‌డే మరింత స్పెషల్ కానుంది. అదే రోజు వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్.. ఈడెన్ గార్డెన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడబోతున్నది. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) కోహ్లీకి సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
రన్ మిషీన్ బర్త్ డేను వినూత్నంగా నిర్వహించేందుకు గాను స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులందరికీ (సుమారు 70 వేలు) కోహ్లీ ఫేస్ మాస్కులను అందించనుంది. అంతేగాక ఇన్నింగ్స్ మధ్యలో ఫైర్ వర్క్స్, ప్రత్యేకమైన లేసర్ షోను ఏర్పాటు చేయనుంది. ఇది ముగిశాక కోహ్లీ కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చిన కేక్‌ను అతడి చేతుల మీదుగా కట్ చేయించేందుకు క్యాబ్ సన్నాహకాలు చేస్తోంది.
A special programme for Virat Kohli on his birthday at Eden gardens by CAB on 5th November: (RevSportz)
– A special cake for Virat Kohli.
– Fireworks for him.
– Leser show for him.
– 70K King Kohli masks for fans.– King Kohli, The 🐐. pic.twitter.com/IBDleJADqD
— CricketMAN2 (@ImTanujSingh) October 30, 2023
ఈ మేరకు క్యాబ్ అధ్యక్షుడు స్నేహశీశ్ గంగూలీ ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. ‘అవును.. మేం విరాట్ కోహ్లీ పుట్టినరోజును ఘనంగా నిర్వహించబోతున్నాం. కోహ్లీ కోసం ప్రత్యేక కేక్ కూడా తయారుచేయించాం. ప్రస్తుతానికి నేను అందుకు సంబంధించిన ఫోటోలను మీకు ఇవ్వలేను. కానీ అది అందరినీ సర్ప్రైజ్ చేసేలా ఉంటుందని మాత్రం హామీ ఇస్తున్నా. ఇన్నింగ్స్ మధ్యలో ఫైర్ వర్క్స్, లైటింగ్ షో కూడా ప్లాన్ చేశాం. సుమారు 70 వేల కోహ్లీ ఫేస్ మాస్కులను అందించబోతున్నాం..’ అని తెలిపాడు. నవంబర్ ఐదున ఈడెన్ గార్డెన్లో పూర్తిస్థాయిలో అటెండెన్స్ ఉంటుందని క్యాబ్ భావిస్తోంది. కాగా వన్డేలలో 48 శతకాలు పూర్తిచేసిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును ముంబైలో పూర్తిచేసి ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో 50వ సెంచరీ చేయాలని కోల్‌కతా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.