ఢిల్లీ: వారం రోజుల వ్యవధిలో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాంట్రాక్టులపై బీసీసీఐ స్పందించింది. టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్నా వారిద్దరూ.. బీసీసీఐ గత ఏప్రిల్‌లో ప్రకటించిన మేరకు గ్రేడ్-ఏ లోనే కొనసాగుతారని బోర్డు సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ‘రెండు ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కోహ్లీ, రోహిత్ గ్రేడ్- ఏ కాంట్రాక్టులు కొననసాగుతాయి. వాళ్లు ఇప్పటికీ భారత క్రికెట్ జట్టులో భాగమే. గ్రేడ్-ఏ సౌకర్యాలన్నీ వారికి అందుతాయి’ అని వెల్లడించారు.