లండన్: క్రికెటర్ విరాట్ కోహ్లీ(Kohli), అనుష్కా శర్మ.. ఇద్దరు కలిసి ఇటీవల వింబుల్డన్ మ్యాచ్ వీక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆ టోర్నమెంట్లో.. అలెక్స్ డీ మినార్‌తో జోకోవిచ్ ఆడిన మ్యాచ్‌ను చూసేందుకు ఆ జంట వెళ్లింది. స్టాండ్స్‌లో అనుష్కా శర్మ, కోహ్లీ కూర్చున్న ఫోటో ఒకటి రిలీజైంది. అయితే అదే మ్యాచ్‌లను నటి అవ్నీత్ కౌర్ కూడా తిలకించింది. ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వింబుల్డన్ ఫోటోలను పోస్టు చేసింది. దీంటో ఇంటర్నెట్లో ట్రోలర్స్ చెలరేగిపోతున్నారు.
అలెక్స్‌ను ఓడించిన జోకోవిచ్ ఈజీగా క్వార్టర్స్‌కు వెళ్లాడనని, కానీ అసలైన మ్యాచ్ మాత్రం స్టాండ్స్‌లో జరుగుతున్నట్లు కొందరు కామెంట్ చేశారు. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను తిలకిస్తున్నట్లు రిలీజైన ఫోటోలో అనుష్కా కాస్త సీరియస్‌గా ఉంది.
ఇటీవల అవ్నీత్ కౌర్ ఇన్‌స్టా ఫోటోకు లైక్ కొట్టిన విరాట్ కోహ్లీ ఇరకాటంలో పడ్డ విషయం తెలిసిందే. మే నెలలో ఈ ఘటన చోటుచేసుకున్నది. సోషల్ మీడియాలో అది రచ్చగా మారింది. తొలుత అవ్నీత్ కౌర్ ఫోటోను లైక్ చేసిన కోహ్లీ, ఆ తర్వాత అన్‌లైక్ చేశాడు. తానేమీ లైక్ కొట్టలేదని, అది అల్గరిథమ్ తప్పిదమని తప్పించుకున్నాడు.
వింబుల్డన్ సెంటర్ కోర్టులో జరిగిన మ్యాచ్ గురించి మాత్రం ఇంటర్నెట్ యూజర్లు కొత్త కామెంట్లు చేశారు. అనుకోకుండా జరిగిందే కావొచ్చు కానీ, ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేదన్నారు. వింబుల్డన్ మ్యాచ్ చూసిన అవ్నీత్ కౌర్ ఫోటో బయటకు రాగానే నెటిజన్లు మీమ్స్‌తో రెచ్చిపోయారు. ఇది అల్గరిథమ్ తప్పిదమేనా అని రాసుకున్నారు.
avneet kaur meeting Kohli and Anushka at wimbeldon pic.twitter.com/TtondaJILE
— SwatKat💃 (@swatic12) July 9, 2025
#ViratKohli ne socha b nahi hoga #wimbeldon me algorithim aa jayega#AvneetKaur #Grok #wimbeldon2025 pic.twitter.com/Jo5O1Nva17
— “Movie Keeda Diaries : Cinematic Obsession” (@altamash4u) July 9, 2025