న్యూఢిల్లీ: విరుష్కా(Kohli Anushka) జంట.. వృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ తన భార్య అనుష్కా శర్మతో కలిసి ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ప్రేమానంద్ మహారాజ్‌కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లారు. కోహ్లీ, అనుష్కా దంపతులు ఇప్పటికే అనేక సార్లు ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ఆశ్రమానికి వెళ్లి బయటకు వస్తున్న కోహ్లీ విజువల్స్ ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్‌లతో తమ ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు తరుచూ అనుష్క, కోహ్లీ జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. గత ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ట్రోఫీ పట్టుకున్న సమయంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ తర్వాత జరిగిన ఓ ఈవెంట్లో విరుష్కా జంట డ్యాన్స్ చేసింది.