Virat Kohli | భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. తమ ఆరాధ్య ప్లేయర్ల ఆటను ఒక్కసారైనా దగ్గర్నుంచి చూడాలని అనుకుంటారు. ఇప్పుడు ఇదే కోవలో ఉన్నావ్‌కు చెందిన 15 ఏండ్ల కార్తీకేయ్ అనే కుర్రాడు..కోహ్లీ ఆట చూసేందుకు ఏకంగా 58కి.మీలు సైకిల్ మీద మ్యాచ్ వేదికైన కాన్పూర్‌కు వచ్చాడు.
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న కార్తీకేయ్..తాను అభిమానించే కోహ్లీ కోసం ఇంతదూరం ఒంటరిగా వచ్చినట్లు మీడియాతో పేర్కొన్నాడు. కార్తీకేయకు క్రికెట్‌పై ఉన్న ఇష్టానికి అందరూ ఫిదా అవుతున్నారు.