Amul Doodle | ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించిన విషయం తెలిసిందే. ఫీల్డ్ అంపైర్ అనుమతి లేకుండా వేలికి క్రీమ్ రాసుకున్నందుకు డీమెరిట్ పాయింట్‌కు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో అమూల్ డూడుల్‌ను సోషల్ మీడియాలో డూడుల్‌ను పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ‘స్టార్ ఇండియన్ ఆల్ రౌండర్ బంతిపై క్రీమ్ రాసినందుకు జరిమానా!’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ‘జడ్డూ ఉంగ్లీ సిర్ఫ్ బటర్ మే దాలో!’ (వెన్నలో వేలును మాత్రమే పెట్టు) అని ఉన్న ఫొటో అమూల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇప్పటి వరకు 72వేలమందికిపైగా వీక్షించగా.. 7,600కుపైగా లైక్స్, 300 వరకు రీ ట్వీట్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా.. నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో బౌలర్ మహ్మద్ సిరాజ్ అరచేతి నుంచి ఓ పదార్థాన్ని తీసుకొని ఎడమ చేతి చూపుడు వేలుకు రుద్దడం కనిపించింది. అయితే, బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వైద్యపరమైన కారణాలతోనే క్రీమ్‌ను వాడినట్లు ఐసీసీ తెలిపింది. బాల్ ట్యాంపరింగ్‌పై వచ్చిన ఆరోపణలు ఖండించింది. క్రీమ్‌ను బంతికి పూయలేదని, ఫలితంగా బంతిలో ఎలాంటి మార్పులు రాలేదని ఐసీసీ పేర్కొంది.
#Amul Topical: Star Indian all- rounder fined for applying cream on the ball! pic.twitter.com/whDgVVXrQh
— Amul.coop (@Amul_Coop) February 12, 2023