Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య విజేత వినేశ్ ఫొగట్.. రీఎంట్రీలో అదరగొట్టింది. రాజస్తాన్‌లోని జైపూర్ వేదికగా అడ్‌హక్ కమిటీ నిర్వహిస్తున్న సీనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో గోల్డ్ కొట్టింది. ఇటీవలే మొదలైన ఈ టోర్నీలో భాగంగా మహిళల 55 కిలోల విభాగంలో ఆమె 4-0 తేడాతో మధ్యప్రదేశ్‌కు చెందిన రెజ్లర్ జ్యోతిని ఓడించింది.
29 ఏండ్ల వినేశ్.. రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఆర్ఎస్పీబీ) తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నది. ఆమె 16 నెలల పాటు రెజ్లింగ్‌కు దూరంగా ఉంది. గతేడాది భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలతో ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని రాజీ లేని పోరాటం చేసిన రెజ్లర్లకు వినేశ్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే.
SENIOR NATIONAL WRESTLING CHAMPIONSHIP 2024
VINESH PHOGAT WINS GOLD 🥇
Vinesh Phogat wins the Gold medal by defeating Jyoti in the finals.
WHAT A COMEBACK 🔥🔥@Phogat_Vinesh#Wrestling #VineshPhogat #NationalWrestlingChampionship #Jaipur pic.twitter.com/b3fAXVxpxn
— nnis (@nnis_sports) February 4, 2024
గతేడాది సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య జరిగిన ఆసియా క్రీడలలో ఫొగట్ పాల్గొనలేదు. మోకాలి గాయం కారణంగా వినేశ్.. 2023 ఆసియా క్రీడల నుంచి తప్పుకుంది. వినేశ్ చివరిసారిగా 2022లో బెల్గ్రేడ్ వేదికగా ముగిసిన వరల్డ్ ఛాంపియన్స్‌లో పాల్గొంది. ఆ తర్వాత బరిలోకి దిగడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.