Aryan Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025’ (NDTV Indian Of The Year 2025) వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దర్శకుడిగా తన తొలి డెబ్యూ మూవీ ‘ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Ba**ds of Bollywood) సినిమాకు గాను ఆర్యన్ ‘డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకకు ఆర్యన్ తన అమ్మమ్మ సవితా చిబ్బర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్యన్ ఖాన్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవార్డు అందుకున్న తర్వాత ఆర్యన్ ఖాన్ మాట్లాడుతూ.. తన తండ్రి షారుఖ్ ఖాన్‌ను గుర్తు చేసుకుంటూనే, తన విజయాన్ని తల్లి గౌరీ ఖాన్‌కు అంకితం ఇచ్చారు. “ఒక కొత్త దర్శకుడిగా నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నా టీమ్ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది నా కెరీర్లో మొదటి అవార్డు. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను. మా నాన్నకు అవార్డులంటే ఎంత ఇష్టమో, నాకు కూడా అంతే ఇష్టం. కానీ, ఈ అవార్డు మాత్రం నాన్న కోసం కాదు.. ఇది నా అమ్మ (గౌరీ ఖాన్) కోసం! అని అన్నాడు. అలాగే తన తల్లి ఇచ్చే సలహాలను గుర్తు చేసుకుంటూ.. “త్వరగా పడుకో, ఎవరినీ ఎగతాళి చేయకు, అసభ్య పదజాలం వాడకు అని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. ఈ రోజు ఈ అవార్డు రావడం వల్ల ఆమె చాలా సంతోషిస్తుంది. ఈ రాత్రి ఇంటికి వెళ్ళాక ఆమె నుంచి నాకు తిట్లు కొంచెం తగ్గుతాయనుకుంటున్నాను అంటూ ఆర్యన్ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌తో ఆర్యన్ దర్శకుడిగా పరిచయమయ్యారు.
#IOY2025 | Aryan Khan At NDTV Indian Of The Year 2025: “This Award Is Not For My Dad, But Mom” #NDTVIndianOfTheYear pic.twitter.com/Y8m4Iy4Nkq
— NDTV (@ndtv) December 19, 2025