Tiger | బుగ్గ శివారులో పెద్దపులి అలజడి.. డప్పు చాటింపు వేయించి అలెర్ట్
మంచిర్యాల (Mancherial) జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులి (Tiger) సంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం సమీపంలో పెద్దపులిని ప్రత్యక్షంగా చూసిన పలువురు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కాసిపేట, డిసెంబర్ 20: మంచిర్యాల (Mancherial) జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులి (Tiger) సంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం సమీపంలో పెద్దపులిని ప్రత్యక్షంగా చూసిన పలువురు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ సిబ్బంది బుగ్గ శివాలయ ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు.
కాసిపేట మండలంలోని తిరుమలాపూర్ మీదుగా బుగ్గగూడెం ప్రాంతానికి వచ్చిన పెద్దపులి.. అక్కడ సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో బుగ్గగూడ శివారులో పెద్దపులి ఓ బర్రెను హతమార్చిన విషయం తెలిసిందే. కాసిపేట, తిర్యాణి మధ్య విస్తరించి ఉన్న అడవుల్లో సంచరిస్తున్న పెద్దపులి మళ్ళీ జనావాసాలకు దగ్గరగా సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుగ్గ దేవాలయం వెనుక వైపు పెద్దపులి సంచరించగా, వాటి ఆధారంగా అది మాదారం వైపు వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు శివారు గ్రామాల్లో, బుగ్గగూడెం గ్రామ పంచాయతీలో పెద్దపులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు వేయించారు. అడవిలోకి వెళ్లొద్దని, పశువులను తీసుకుపోవద్దని, జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

