Sampoornesh Babu | నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుంచి ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబును ఒక సరికొత్త ఊర మాస్ అవతారంలో శ్రీకాంత్ ఓదెల చూపించబోతున్నాడు. ఎప్పుడూ తనదైన కామెడీతో నవ్వించే సంపూర్ణేష్ బాబును దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పూర్తిగా మార్చేశాడు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో సంపూ ‘బిర్యానీ’ అనే మాస్ పాత్రను పోషిస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పోస్టర్లో సంపూర్ణేష్ బాబు ఒంటి నిండా రక్తపు మరకలతో, భుజాన గొడ్డలి వేసుకుని, బీడీ తాగుతూ చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కళ్లలో కనిపిస్తున్న క్రూరత్వం చూస్తుంటే, ఇందులో ఆయన కేవలం కామెడీకి పరిమితం కాకుండా ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరో నాని (జడల్) కి అత్యంత సన్నిహితుడైన స్నేహితుడిగా, ప్రాణమిచ్చే నమ్మకస్థుడిగా ‘బిర్యానీ’ పాత్ర ఉండబోతోంది. ఈ పాత్ర కోసం సంపూర్ణేష్ బాబు చాలా బరువు తగ్గి, తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా పూర్తిగా మార్చుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
శ్రీకాంత్ ఓదెల ప్లాన్ ఇదేనా?
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన సినిమాల్లో పాత్రలను చాలా సహజంగా, గంభీరంగా చూపిస్తారు. ‘దసరా’లో కమెడియన్లను కూడా సీరియస్ పాత్రల్లో చూపించినట్లుగానే, ఇప్పుడు సంపూ లోని యాక్షన్ యాంగిల్‌ను బయటకు తీయబోతున్నారు. “హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథలో ‘బిర్యానీ’ లేకుండా ఉండదు” అంటూ ఈ పాత్రను ఇంట్రడ్యూస్ చేసిన తీరు వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నానితో పాటు, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమా 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్) గ్రాండ్‌గా విడుదల కానుంది.
A story cannot be set in Hyderabad without Biryani 😉
Introducing an all new @sampoornesh as ‘Biryani’ from #TheParadise 🔥❤️🔥
Jadal’s Best Friend 🫂 pic.twitter.com/iMLTQY1jgU
— THE PARADISE (@TheParadiseOffl) December 19, 2025