న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో డెన్మార్క్ దిగ్గజ షట్లర్ విక్టర్ అక్సెల్సన్ శకం ముగిసింది. తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు అక్సెల్సన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. చాలా కాలంగా వెన్నుగాయంతో బాధపడుతున్న ఈ 32 ఏండ్ల షట్లర్ ఇక కెరీర్ కొనసాగించలేనంటూ పేర్కొన్నాడు.
టోక్యోతో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పతక విజేతగా నిలిచిన విక్టర్ తన కెరీర్లో అసమాన విజయాలు అందుకున్నాడు. డబుల్ ఒలింపిక్స్‌తో పాటు 2017, 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ విజేతగా సత్తాచాటాడు. నిరుడు అక్టోబర్ నుంచి వెన్ను నొప్పితో బాధపడుతున్న అక్సెల్సన్ టోర్నీలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కోర్టులో ప్రత్యర్థులను హడలెత్తించే అక్సెల్సన్ ప్రపంచ నంబర్‌వన్ షట్లర్‌గా 183 వారాల పాటు కొనసాగి రికార్డు నెలకొల్పాడు.