జైపూర్: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ ఎంపికయ్యాడు. రానున్న సీజన్ కోసం ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను చీఫ్ కోచ్‌గా తీసుకున్న రాయల్స్ యాజమాన్యం తాజాగా విక్రమ్‌ను నియమించుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2019 నుంచి ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ వరకు టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ రాథోడ్ వ్యవహరించాడు. ‘ద్రవిడ్‌తో కలిసి మళ్లీ పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. రాయల్స్ కుటుంబంలో భాగం కాబోతున్నందుకు గర్వపడుతున్నాను’ అని అన్నాడు.
గుర్బాజ్ శతక చరిత్ర
షార్జా: దక్షిణాఫ్రికాతో షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్(105) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఫ్గన్ తరఫున దక్షిణాఫ్రికాపై వన్డేలలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. వన్డేలలో అతడికి ఇది 7వ శతకం. తద్వారా ఆ జట్టు తరఫున వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన మహ్మద్ షాజాద్ (6) రికార్డును అధిగమించాడు. గుర్బాజ్‌తో పాటు అజ్మతుల్లా (86 నాటౌట్), రెహ్మత్ షా(50) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోరు చేసింది.