హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విక్రమ్ ఆదిత్య రెడ్డి ఎన్నికయ్యారు. 2025-29 కాలానికి గాను ఆదివారం జరిగిన ఎన్నికల్లో కొత్త కార్యవర్గం ఏర్పాటు కాగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా రామ్మోహన్.. ఉపాధ్యక్షులుగా మహ్మద్ ఖాజా, వెంకటేశ్వర్ రావు, లిల్లీ ఫ్లోరెన్స్, దీపిక ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా శిరీష రాణి, ట్రెసరర్గా రామును ఎన్నుకున్నట్టు నెట్‌బాల్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.