విజయనగరం : విదర్భ స్టార్ క్రికెటర్ కరణ్ నాయర్(101 బంతుల్లో 112, 11ఫోర్లు, 2సిక్స్‌లు) సూపర్ సెంచరీతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఔట్ కాకుండా అత్యధిక పరుగులు(542) పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నాయర్ నయా ఫీట్ నెలకొల్పాడు. దీంతో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్(527) నెలకొల్పిన రికార్డును నాయర్ తాజాగా తుడిచిపెట్టాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ ద్వారా ఈ స్టార్ బ్యాటర్ ఘనత అందుకున్నాడు. నాయర్‌తో పాటు యశ్ రాథోడ్(138) సెంచరీ చేయడంతో విదర్భ 8 వికెట్ల తేడాతో యూపీపై గెలిచింది. అయితే తొలుత యూపీ 50 ఓవర్లలో 307-8 స్కోరు చేసింది. సమీర్ రిజ్వి(105), మాధవ్ కౌశిక్(41), ప్రియమ్ గార్గ్(34), శివమ్ మావి(33 నాటౌట్) రాణించారు.