Vijay Hazare Trophy 2023: దేశవాళీ క్రికెట్లో సుమారు 20 రోజులుగా సాగుతున్న విజయ్ హజారే ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. నేడు ముగిసిన ఆఖరి లీగ్ పోటీలతో సెమీస్ బెర్తులు ఖాయమయ్యాయి. బెంగాల్-హర్యానా, రాజస్తాన్-కేరళ, విదర్భ – కర్నాటక, ముంబై – తమిళనాడు మధ్య క్వార్టర్స్ పోరులో హర్యానా, రాజస్తాన్, కర్నాటక, తమిళనాడులు గెలిచి సెమీఫైన్సల్స్కు ప్రవేశించాయి.
సోమవారం రాజ్‌కోట్ వేదికగా హర్యానా – బెంగాల్ మధ్య జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. బెంగాల్ యువ ఆల్ రౌండర్ షాదాబ్ అహ్మద్ సెంచరీ (118 బంతుల్లో 100, 4 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించాడు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అనంతరం లక్ష్యాన్ని హర్యానా 45.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్ అంకిత్ కుమార్ (102) సెంచరీ చేశాడు.
రెండో క్వార్టర్స్‌లో రాజస్తాన్.. కేరళను చిత్తుగా ఓడించింది. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రర్ (122) సెంచరీ చేశాడు. అనంతరం కేరళ.. 21 ఓవర్లలో 67 పరుగులకే చాప చుట్టేసింది. విదర్భ-కర్నాటక మధ్య జరిగిన మూడో క్వార్టర్స్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విదర్భ.. 44.5 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌట్ కాగా లక్ష్యాన్ని కర్నాటక 40.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Splendid Opening Act 👏
Ankit Kumar hit a superb 102(102) to help Haryana Chase down 226 in in Quarter Final 1 of the @IDFCFIRSTBank #VijayHazareTrophy
Watch his stroke-filled knock 🔽https://t.co/gIjiPCCORW
— BCCI Domestic (@BCCIdomestic) December 11, 2023
తమిళనాడు – ముంబై మధ్య జరిగిన నాలుగో క్వార్టర్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. 48.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యాన్ని తమిళనాడు 43.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బాబా ఇంద్రజిత్ (103) అజేయ శతకంతో ఆ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. బుధవారం (డిసెంబర్ 13) రాజ్‌కోట్ వేదికగానే హర్యానా – తమిళనాడు తొలి సెమీస్ ఆడనుండగా 14న ఇదే వేదికలో రాజస్తాన్.. కర్నాటకను రెండో సెమీస్‌లో ఢీకొననుంది. డిసెంబర్ 16న ఫైనల్ జరగాల్సి ఉంది.
Here are the semi-finalists of the IDFC FIRST Bank #VijayHazareTrophy 🙌
Which team are you rooting for 🤔 pic.twitter.com/XsG2FHsQwd
— BCCI Domestic (@BCCIdomestic) December 11, 2023