INDU19 vs BANU19 : పురుషుల అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో అభిగ్యాన్ కుందు(80), వైభవ్ సూర్యవంశీ(72) అర్ధ శతకాలతో రాణించగా.. అనంతరం విహాన్ మల్హోత్రా(4-14) స్పిన్ మాయాజాలంతో బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు. వర్షం అంతరాయం కారణంగా బంగ్లా ఇన్నింగ్స్‌ను 29 ఓవర్లకు కుదించగా.. 146కే ప్రత్యర్థిని పడగొట్టింది టీమిండియా.
తొలి పోరులో యూఎస్ఏను చిత్తు చేసిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. స్వల్ప స్కోరే చేసినప్పటికీ విహాన్ మల్హోత్రా(4-14) విజృంభణతో ప్రత్యర్థిని 146కే ఆలౌట్ చేసింది టీమిండియా. వర్షం అంతరాయం నడుమ సాగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ ప్రకారం మొదట 49 ఓవర్ల మ్యాచ్ అనుకున్నారు. కానీ, బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం మళ్లీ అడ్డుపడడంతో.. 29 ఓవర్లకు కుదించారు. ఓపెనర్ రిఫత్ బెగ్(37) రాణించినా విహాన్ మల్హోత్రా తిప్పేయడంతో బంగ్లా బ్యాటర్లు వరుసగా డగౌట్‌కు క్యూ కట్టారు. ఖిలాన్ పటేల్ సైతం రెండు వికెట్లు తీయడంతో బంగ్లా 146కే ఆలౌటయ్యింది.
Vihaan Malhotra is the Player of the Match for his fantastic spell 🙌
India U19 clinch a thriller by 18 runs (DLS Method) to make it 2⃣ wins out of 2⃣ 👌
Scorecard ▶️ https://t.co/8P6KxkszO5#U19WorldCup pic.twitter.com/uEen5eU9X3
— BCCI (@BCCI) January 17, 2026
టాస్ ఓడిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ ఆయుష్ మాత్రే(6)ను ఔట్ చేసి షాకిచ్చాడు ఫాహద్(5-38). ఆ తర్వాతి బంతికే వేదాంత్ త్రివేది(0)ని డకౌట్ చేయడంతో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ(72). కానీ,.. తమిమ్ ఓవర్లో విహాన్ మల్హోత్రా వెనుదిరగడంతో 53కే మూడు వికెట్లు పడ్డాయి. ఆ దశలో వైభవ్ తన స్టయిల్ విధ్వంసంతో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు.
అభిగ్యాన్ కుందు(80), వైభవ్ సూర్యవంశీ(72)
సెంచరీ దాటించిన వైభవ్ 115వద్ద అతడు ఔటయ్యాక.. కనిష్క్ చౌహన్ (28), టెయిలెండర్ల సాయంతో వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు(80) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివరి దాకా నిలబడిన అతడు హాఫ్ సెంచరీతో స్కోర్ 200 దాటించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. 48వ ఓవర్లో దీపేశ్ దేవేంద్రన్(11) 4, 6 బాదాడు. అదే ఊపులో పెద్ద షాట్ ఆడబోయిన అతడు బౌండరీ వద్ద దొరికిపోవడంతో 238 వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది.