హైదరాబాద్, డిసెంబర్ (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సెప్టెంబర్ 18న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు చేశారు. టెండర్ల విషయంలో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే అంతర్జాతీయ మ్యచ్‌లకు రవాణా, క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇవ్వడంలో కొందరు హెచ్‌సీఏ సభ్యులు అవకతవకలకు పాల్పడ్డట్లు కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈమేరకు సంబంధిత దస్ర్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.