హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఆర్హెచ్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వివరాలు సేకరించగా ఈ విష సీఎం దృష్టికి వెళ్లింది. ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బందిపెడితే చర్యలు తీసుకుంటామని హెచ్‌సీఏను ఆయన హెచ్చరించారు. ఇదిలాఉండగా హెచ్‌సీయూ భూముల విషయాన్ని డైవర్ట్ చేసేందుకే సీఎం.. హెచ్‌సీఏ రాగం ఎత్తుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.