ముంబై : యువ గ్రాండ్‌మాస్టర్లు విదిత్ గుజరాతి, దివ్య దేశ్‌ముఖ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. ఇటీవలే హంగేరి వేదికగా ముగిసిన 45వ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల, మహిళల జట్లలో సభ్యులుగా ఉన్న విదిత్, దివ్యకు చెరో కోటి రూపాయల చొప్పున నజరానా ప్రకటిస్తున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.