Vidhu Vinod Chopra: ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటున్న ‘12th Fail’ సినిమా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా కొడుకు క్రికెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీలో భాగంగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో విధు వినోద్ చోప్రా కొడుకు అగ్ని చోప్రా.. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే ఏకంగా 258 పరుగులతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మిజోరం తరఫున ఆడుతున్న అగ్ని చోప్రా.. తన జట్టు విఫలమైనా వన్ మెన్ షోతో అలరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 179 బంతులాడి 19 బౌండరీలు, ఏడు భారీ సిక్సర్ల సాయంతో 166 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో.. 74 బంతుల్లోనే 92 పరుగులతో మెరుపులు మెరిపించాడు.
తండ్రి దర్శకుడైనా క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అగ్ని చోప్రా.. మిచిగాన్ (అమెరికా)లో ఉండగానే ఈ ఆటలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. భారత్‌కు తిరిగొచ్చాక ముంబైలో పలు టీ20 టోర్నీలలో తన సత్తా చాటిన ఈ కుర్రాడు.. ఈ ఏడాది సయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో దేశవాళీలో అరంగేట్రం చేశాడు. ఆ ట్రోఫీలో అంతగా ఆకట్టుకోకపోయినా రంజీలలో మాత్రం తొలి మ్యాచ్‌తోనే సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు.
’12th Fail’ movie director Vidhu Vinod Chopra’s Son Agni Chopra had a Stupendous Start to his First Class Career and Stole the Show in the Ranji Trophy with a remarkable 166 runs off 179 balls in the First innings and went on to Score a Swift 92 runs off just 74 balls in the… pic.twitter.com/L3Jtq85UvZ
— Balaji Iyengar (@imbalaji007) January 10, 2024
మిషన్ కాశ్మీర్, మున్నాభాయ్ సిరీస్, పీకే, త్రీ ఇడియట్స్, సంజూ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన విధు వినోద్ చోప్రా.. గతేడాది 12th ఫెయిల్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ప్రముఖ వెబ్సైట్ ఐఎండీబీ.. ఈ సినిమాకు ఏకంగా 9.2 రేటింగ్ ఇచ్చింది.