నాగ్‌పూర్: రంజీ టోర్నీలో విదర్భ విజేతగా నిలిచింది. కేరళతో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరు డ్రా అయ్యింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విదర్భ రంజీ టైటిల్ విజేతగా నిలిచింది. విదర్భకు ఇది మూడో ట్రోఫీ కావడం విశేషం. ఈ సీజన్ ఆసాంతం సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన విదర్భ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 249/4తో ఆఖరి రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన విదర్భ 375/9 స్కోరు చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ కరణ్ నాయర్ (135) త్వరగానే నిష్క్రమించాడు.
ఆ తర్వాత వచ్చిన దర్శన్ నల్కందే (51 నాటౌట్), అక్షయ్ కర్నెవార్ (30) ఆకట్టుకున్నారు. కేళ బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదిత్య సర్వాతె (4/96) నాలుగు వికెట్లతో రాణించాడు. దానిశ్ మలెవార్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, రంజీల్లో కొత్త చరిత్ర లిఖించిన హర్ష్‌దూబే (69 వికెట్లు, 476 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
మూడోసారి రంజీ టైటిల్ గెలిచిన తమ జట్టుకు విదర్భ క్రికెట్ అసోసియేషన్(వీసీఏ) 3 కోట్ల నజరానా ప్రకటించింది.