Ranji Trophy 2024 : వాంఖడే స్టేడియంలో హోరాహోరీగా సాగుతున్న రంజీ ఫైనల్లో ముంబై(Mumbai) జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్(75) హాఫ్ సెంచరీతో పరువు కాపాడగా.. అనంతరం బౌలర్లు నిప్పులు చెరిగారు. ధవల్ కులకర్ణి, శామ్స్ ములానీ విజృంభణతో విదర్భ(Vidarbha) జట్టు 105 పరుగులకే ఆలౌటయ్యింది. దాంతో, ముంబైకి 119 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు కీలకమైన మూడు వికెట్లు తీసిన ముంబై బౌలర్లు రెండో రోజు విదర్భ ఆటగాళ్లను బెంబేలెత్తించారు.
Tanush Kotian joins the wicket taking party 🙌
Gets the vital wicket of Yash Rathod at the stroke of lunch to reduce Vidarbha to 97/8 👌@IDFCFIRSTBank | #Final | #MUMvVID
Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/PhJSA0rzVb
— BCCI Domestic (@BCCIdomestic) March 11, 2024
ఆట మొదలైన కాసేపటికే తైడేను ఔట్ చేసిన కులకర్ణి ప్రత్యర్థిని కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత ఆదిత్య థాకరే(19), యశ్ రాథోడ్(27)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. థాక్రేను ఔట్ చేసిన శామ్స్ ములానీ ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత తనుష్ కొటియన్ టెయిలెండర్ల పనిపట్టడంతో విదర్భ లంచ్ సమయానికే చాపచుట్టేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడితే విదర్భకు కష్టకాలమే.
Innings Break!
Mumbai have bowled Vidarbha out for 105 in the 1st innings, taking a lead of 119 runs.
3⃣ wickets each for Dhawal Kulkarni, Shams Mulani & Tanush Kotian
1⃣ wicket for Shardul Thakur@IDFCFIRSTBank | #Final | #MUMvVIDScorecard ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/OeswFfXSoV
— BCCI Domestic (@BCCIdomestic) March 11, 2024
వాంఖడే స్టేడియం జరుగుతున్న ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్ పృథ్వీ షా(46) ఒక్కడే ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ అజింక్యా రహానే(7), శ్రేయస్ అయ్యర్(7) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. కష్టాల్లో పడ్డ జట్టును శార్థూల్ (75) వీరోచిత హాఫ్ సెంచరీతో ఒడ్డును పడేశాడు. దాంతో, ముంబై 224 పరుగులకు ఆలౌటైంది. యశ్ ఠాకూర్, హర్ష్ దూబేలు చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
I.C.Y.M.I
Another fighting knock 💪@imShard came in at 111/6 and spearheaded Mumbai’s fight with an attacking 75(69) to help them post 224 🙌
Relive 📽️ his crucial knock 🔽@IDFCFIRSTBank | #Final | #MUMvVID
Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/t1ZEsTRuy8
— BCCI Domestic (@BCCIdomestic) March 10, 2024